Peddha Peddha Kallathoti (From "Hello Guru Prema Kosame")

పెద్ద పెద్ద కళ్ళతోటి
నా చిన్ని చిన్ని గుండెలోకి
తొంగి తొంగి చూసినావె ఓ పిల్ల (పిల్ల)

అల్లి బిల్లి నవ్వుతోటి
నా బుల్లి బుల్లి మనసు తాకి
గిల్లి గిల్లి చంపినావే ఓ బాల (బాల)

చందమామ చుట్టూర చుక్కలున్నట్టు
నన్ను చుట్టు ముట్టాయే నీ ఊహలే
పుట్టలోన వేలు పెడితే చీమ కుట్టి నట్టు
నన్ను పట్టి కుట్టాయిలే
పెద్ద పెద్ద కళ్ళతోటి

నా చిన్ని చిన్ని గుండెలోకి
తొంగి తొంగి చూసినావె ఓ పిల్ల Oh yeah

Oh English భాష మీద పట్టు లేదే

తెలుగులోని ఛందస్సు చదవలేదే
హిందిలో షయరీ మనకు రాదే
నాలో ఈ కవిత్వాల ఘనత నీదే
ఆత్రేయ గొప్పతనం తెలుసుకున్న
వేటూరి చిలిపితనం మెచ్చుకున్న
ఎన్నాళ్ళో నుంచి విన్న పాటలైన
ఈరోజే నాకు నచ్చి పాడుతున్న
పాతికేళ్ళకొచ్చాకే నడక నేర్చినట్టు
అడుగుకెన్ని తప్పటడుగులో
పెద్ద పెద్ద కళ్ళతోటి

నా చిన్ని చిన్ని గుండెలోకి
తొంగి తొంగి చూసినావె ఓ పిల్ల Oh yeah oh

భూకంపమంటే భూమి ఊగిపోవడం

Cyclone అంటే ఉప్పెనొచ్చి ముంచడం
ఈ రెంటికన్న చాలా పెద్ద ప్రమాదం
గుప్పెడంత గుండెలోకి నువ్వు దూరడం
ఒంట్లోన వేడి పెరిగితే చలి జ్వరం
నిద్దట్లో ఉలికి పాటు పేరు కలవరం
ఈ రెంటికన్న చాలా వింత లక్షణం
తెల్లార్లు నీ పేరే కలవరించడం
ఇన్ని నాళ్ళు నా జంటై ఉన్న ఏకాంతం
నిన్ను చూసి కుళ్ళుకుందిలే
పెద్ద పెద్ద కళ్ళతోటి
నా చిన్ని చిన్ని గుండెలోకి
తొంగి తొంగి చూసినావె ఓ పిల్ల



Credits
Writer(s): Devi Sri Prasad, Srimani
Lyrics powered by www.musixmatch.com

Link