Mahanati (From "Mahanati")

అభినేత్రి ఓ అభినేత్రి
అభినయనేత్రి నట గాయత్రి
మనసారా నిను కీర్తించి పులకించినది ఈ జనధాత్రి
నిండుగా ఉందిలే దుర్గదీవెనం
ఉందిలే జన్మకో దైవ కారణం
నువ్వుగా వెలిగే ప్రతిభా గుణం
ఆ నటరాజుకు స్త్రీ రూపం
కళకే అంకితం నీ కణకణం
వెండి తెరకెన్నడో ఉందిలే రుణం
పేరుతో పాటుగా అమ్మనే పదం
నీకే దొరికిన సౌభాగ్యం
(మహానటి)
(మహానటి)
(మహానటి)
(మహానటి)
(మహానటి)
(మహానటి)
(మహానటి)
(మహానటి)

కళను వలచావు కలను గెలిచావు
కడలికెదురీది కథగ నిలిచావు
భాష ఏదైనా ఎదిగి ఒదిగావు
చరిత్రపుటలోన వెలుగు పొదిగావు
పెను శికరాగ్రమై గగనాలపై నిలిపావుగా అడుగు
నీ ముఖ చిత్రమై నలుచెరగుల
తల ఎత్తినదీ మన తెలుగు
(మహానటి)
(మహానటి)
(మహానటి)
(మహానటి)
(మహానటి)
(మహానటి)
(మహానటి)
(మహానటి)

మనసు వైశాల్యం పెంచుకున్నావు
పరుల కన్నీరు పంచుకున్నావు
అసలు ధనమేదో తెలుసుకున్నావు
తుదకు మిగిలేది అందుకున్నావు
పరమార్థానికి అసలర్థమే నువు నడిచిన ఈ మార్గం
కనుకే గా మరి నీదైనది నువుగా అడగని వైభోగం
(మహానటి)
(మహానటి)
(మహానటి)
(మహానటి)
(మహానటి)
(మహానటి)
(మహానటి)
(మహానటి)



Credits
Writer(s): Ramajogayya Sastry, Mickey J Meyer
Lyrics powered by www.musixmatch.com

Link