Ney Veyrey

హో నా దేహమంతా నీ స్నేహంతో
నిండింది చూడే నేస్తమా
హో నా మౌనమంతా నీ ధ్యానంలో
మునిగింది చూడే ప్రాణమా
నా చిన్ననాటి నుండే
నీ పేరే వినిపిస్తూ ఉందే
నాకన్న నిన్ను ముందే
చదివేసి ఇటు చేరుకుందే

నే వేరే, నువ్ వేరే కాదు నేస్తమా
నీ తీరే పూదారే
నాకు ప్రాణమా
నే వేరే, నువ్ వేరే కాదు నేస్తమా
నీ తీరే పూదారే
నాకు ప్రాణమా

నీ పాదం స్ప్రుశించాకే
నే తాకానే నీ పెదవిని
నీ ద్వేషాన్నే ముందుగా కలిసి
మళ్లీ చూస్తా నీ ప్రేమని
కసురుల దాగిన కనికరమా
అలకల మాటున అనురాగమా
శిశిరాల జాడిలా ఎదురైన
మరల రాదా
మరు క్షణాన వాసంతమే
నీ చేదు జ్ఞాపకాలే
గాయాలుగా మార్చుకుంటా
నువు నుంచుకున్న చోటే
నను నేను శిక్షించుకుంటా
నే నావై నువు తోవైయ్యాక నేస్తమా
ఏ తీరం ఇక దూరం
కాదు ప్రాణమా

హో నే వేరే, నువ్ వేరే కాదు నేస్తమా
నీ తీరే పూదారే
నాకు ప్రాణమా

నేనేమో ఎండనైతే
నువ్వేమో నా వాన విల్లే
ఈ జంట ఉన్న చోటే
వెలగాలలా వాన విల్లే
నే రాత్రై నువ్వు పగలైతేనే నేస్తమా
ప్రతి రోజూ ఇక పూర్తయ్యేనే ప్రాణమా

హో నే వేరే, నువ్ వేరే కాదు నేస్తమా
నీ తీరే పూదారే
నాకు ప్రాణమా

నే వేరే, నువ్ వేరే కాదు నేస్తమా
నీ తీరే పూదారే
నాకు ప్రాణమా



Credits
Writer(s): Chegondi Anantha Sriram, Shreyas Prashant Puranik
Lyrics powered by www.musixmatch.com

Link