Vaikunta Vasudu Saiye

వైకుంఠ వాసుడు సాయే
జీవ సాఫల్య మంత్రం తన పాదాల సేవే
వైకుంఠ వాసుడు సాయే
జీవ సాఫల్య మంత్రం తన పాదాల సేవే
వైకుంఠ వాసుడు సాయే

(సాయి హరే జయ సాయి రామ్)
(సాయి హరే జయ సాయి రామ్)

శ్రీమన్నారాయణుడు పాలకడలిని పవళించే వైనం అదియే శేష శయనం
శ్రీ సాయినాథుడు ఆధార రహితుడై చేసెను ఆకాశ శయనం
శ్రీ హరియే కృష్ణుడై భక్త కుచేలుని లేమిని పోగొట్టి నటులా
శ్రీ సాయే కరుణించి నిరుపేద భక్తుల నిండుగా తుల తూచే సిరులా

వైకుంఠ వాసుడు సాయే
జీవ సాఫల్య మంత్రం తన పాదాల సేవే
వైకుంఠ వాసుడు సాయే

(సాయి హరే జయ సాయి రామ్)
(సాయి హరే జయ సాయి రామ్)

చక్రధరుడౌ హరి తానే పలు రక్కసి మూకల భంజింజి నటులా
తిరగలి చే బూని సాయే విష వ్యాధుల నిర్జింజే విశ్వాత్మ లీల
ఫల్గుణునకు చేసే గీతా బోధన పార్థ సారధియే హరి అయి
నానాకు తెలిపే గీతా పరమార్థము సాయినాథుడే గురువై

వైకుంఠ వాసుడు సాయే
జీవ సాఫల్య మంత్రం తన పాదాల సేవే
వైకుంఠ వాసుడు సాయే

(సాయి హరే జయ సాయి రామ్)
(సాయి హరే జయ సాయి రామ్)

శ్రీ హరి మాధవుడై ఆ పది వేల గోప్పెమ్మల చిత్తాలు దోచే
ఆ రీతి షిరిడి సాయి వే వేలాది భక్తుల ముక్తుల చేసే
హరి నెలవు వైకుంఠ పురము
ఇల వైకుంఠమేలే ఆ షిరిడి
హరి పదమే భక్తులకు శరణం
షిరిడి దర్శనమదియే భవ హరణం

వైకుంఠ వాసుడు సాయే
జీవ సాఫల్య మంత్రం తన పాదాల సేవే
వైకుంఠ వాసుడు సాయే
జీవ సాఫల్య మంత్రం తన పాదాల సేవే
వైకుంఠ వాసుడు సాయే



Credits
Writer(s): Sahiti, M Radhakrishnan
Lyrics powered by www.musixmatch.com

Link