Shirdi Sai Baba

షిరిడీ సాయిబాబా ఎంత కరుణామయుడవు దేవా
మము కాపాడగనే రావా రావా బాబా
షిరిడీ సాయిబాబా ఎంత కరుణామయుడవు దేవా
మము కాపాడగనే రావా రావా బాబా

షిరిడి పుర దర్శనమే ఈ ఇలలో మొక్కనినావే
ద్వారకమాయి సందర్శనచే సిరులను ఇత్తువు నీవే

నీ భక్తులకే రక్ష
నీ సమాధి ఇచ్చే దీక్ష
చేకొని శ్రితజన పాలన చేసిన మండల కృపా కటాక్ష
బాబా
షిరిడీ సాయిబాబా ఎంత కరుణామయుడవు దేవా
మము కాపాడగనే రావా రావా బాబా

నీ ఆశ్రయమే పొందే
నీ పాదము శరణము వేడే
సన్మార్గులను కాపాడే కర్తవ్యము నీదన్నావే

నీపై దృష్టిని మోపే
ఇక నీవే దిక్కని నమ్మే
దీనులందరినీ దరి చేర్చె భారము మోసెద నీవే
బాబా
షిరిడీ సాయిబాబా ఎంత కరుణామయుడవు దేవా
మము కాపాడగనే రావా రావా బాబా

అడిగిన వెంటనే సాయం మాకందించే దైవం నీవే
సలహా కోరిన భక్తులకై స్పందించెదనని అన్నావే

నమ్మిన చెడుటే లేదు
నిన్నిల నమ్మని వాడే లేడు
ఏకాదశ సూత్రాలతో అమృత గీతను భోదించావే
బాబా
షిరిడీ సాయిబాబా ఎంత కరుణామయుడవు దేవా
మము కాపాడగనే రావా రావా బాబా
షిరిడీ సాయిబాబా ఎంత కరుణామయుడవు దేవా
మము కాపాడగనే రావా రావా బాబా
రావా బాబా



Credits
Writer(s): Sahiti, M Radhakrishnan
Lyrics powered by www.musixmatch.com

Link