Anaganaga Oka

అనగనగా ఒక నిండు చందమామా
నిరుపేద కలువతో చెలిమి చేసెనమ్మా
అంతలోనే తెలవారి పోయెనమ్మా
ఆ కన్నె కలువ కల కరిగి పోయెనమ్మా
పచ్చని జంటను విడదీసిన
ఆ పాపం ఎవ్వరిది
పచ్చని జంటను విడదీసిన
ఆ పాపం ఎవ్వరిది
కధ మొదలవగానే కాలం
కత్తులు దూసింది
కధ మొదలవగానే కాలం
కత్తులు దూసింది

అనగనగా ఒక నిండు చందమామా
నిరుపేద కలువతో చెలిమి చేసెనమ్మా

ఆశలెన్నో విరిసేలా బాసలెన్నో చేశాడు
ఉన్నపాటుగా కన్ను మరుగయే
చలువ చంద్రుడు
ఆశలెన్నో విరిసేలా బాసలెన్నో చేశాడు
ఉన్నపాటుగా కన్ను మరుగయే
చలువ చంద్రుడు
రేరాజును రాహువు మింగాడో
అమవాస్యకు ఆహుతి అయ్యాడో
రేరాజును రాహువు మింగాడో
అమవాస్యకు ఆహుతి అయ్యాడో
అటు ఇటూ వెతుకుతూ
నిలువునా రగులుతూ
వెన్నెల ఉండని వేకువ వద్దని
కలువ జన్మ వడలిపోయెనమ్మా

అనగనగా ఒక నిండు చందమామా
నిరుపేద కలువతో చెలిమి చేసెనమ్మా

గుప్పెడంత గుండెల్లో ఉప్పెనైన సంద్రంలో
చిక్కుకున్న ఈ చిన్న ఆశకి
శ్వాస ఆడదే
దిక్కులన్ని చూస్తున్నా నింగిని నిలదీస్తున్నా
దిక్కులేని ఈ దిగులు ప్రశ్నకి
బదులు దొరకదే
చిరునవ్వులు పూసిన మంట ఇది
కన్నీటిని కోరని కోత ఇది
చిరునవ్వులు పూసిన మంట ఇది
కన్నీటిని కోరని కోత ఇది
ఓటమై ముగెసెనా గెలుపుగా మిగిలెనా
జాబిలి వెన్నెల మాటునరేగిన
జ్వాలలాంటి వింత బ్రతుకు నాది

కలువని చంద్రుని ఎందుకు కలిపాడు
ఆ కలయిక కలగా ఎందుకు మార్చాడు
ఆ కధ రాసిన దేవుడన్నవాడు
కరుణన్నది ఎరుగని కటిక గుండెవాడు
నా కధలో ఆ దేవుడు ఎంతటి
దయ చూపించాడూ
అడగక ముందే ఇంతటి పెన్నిధి
నా కందించాడు

కలలే కరగని ఈ చంద్రుని
నేస్తమ్ చేశాడూ
ఎపుడూ వాడని ఈ కలువని
చెలిగా ఇచ్చాడూ



Credits
Writer(s): Chembolu Seetharama Sastry, Vandematharam Srinivas
Lyrics powered by www.musixmatch.com

Link