Ide Manchi Roju

చిత్రం: పెళ్ళి పందిరి (1998)
సంగీతం: వందేమాతరం శ్రీనివాస్
సాహిత్యం: సిరివెన్నెల

ఇదే మంచి రోజంది ముచ్చటగా ఇలా పంచ భూతాలు సాక్షులుగా

చినుకులనే అక్షింతలుగా మెరుపులతో దీవించెనుగా
మేఘాల పెళ్లిపందిరి

కలల రాణి కనులలోని కటిక చీకటి చెలిమి వీడి చలువలోన కరుగుతున్నది
నిదరలోనే నిలిచిపోదు కాలమన్నది వెలుగువేలు రేయిచెలిమి అందుకున్నది
వరాల పెన్నిది వరించు తున్నది
తరంగమై మది తదాస్తు అన్నది
గుండెల్లో ఈనాడు గంగల్లే పొంగింది రంగేళి దీపావళి
ముంగెల్లో ఈనాడు సంక్రాంతి ముగ్గల్లే చేరింది నా నెచ్చెలి

ఇదే మంచి రోజంది ముచ్చటగా ఇలా పంచ భూతాలు సాక్షులుగా

మావిమాలు అల్లుకున్న మాలవిలతా జీవితాన్ని పంచుతున్న ప్రేమదేవత
గుడికి చేరే గరికపువ్వులాంటి నా కధ బ్రతుకు తీపి తెలుసుకుంది నేడు నా ఎద
కళ్యాణ మంత్రమై దీవించే ఈ క్షణం
వెయ్యేళ్ళ బంధమై రమ్మంది కాపురం
పారాణి పాదాల తారాడు నాధాలకాహ్వానమందిచనా
నాలోని ప్రాణాలు పూమాలగా చేసి నీ పూజ కందించనా

ఇదే మంచి రోజంది ముచ్చటగా ఇలా పంచ భూతాలు సాక్షులుగా
ఇదే మంచి రోజంది ముచ్చటగా ఇలా పంచ భూతాలు సాక్షులుగా
చిరునవ్వులనే అక్షింతలుగా సొగసులతో దీవించెనుగా అందాల పెళ్లిపందిరి

ఇదే మంచి రోజంది ముచ్చటగా ఇలా పంచ భూతాలు సాక్షులుగా
ఇదే మంచి రోజంది ముచ్చటగా ఇలా పంచ భూతాలు సాక్షులుగా

Credits
Writer(s): Chembolu Seetharama Sastry, Vandematharam Srinivas
Lyrics powered by www.musixmatch.com

Link