Virisindhee Vasanthaganam

విరిసినదీ వసంతగానం వలపుల పల్లవిగా
విరిసినదీ వసంతగానం వలపుల పల్లవిగా
మనసే మందారమై వయసే మకరందమై
అదేదో మాయ చేసినది
విరిసినదీ వసంతగానం వలపుల పల్లవిగా

ఝుమ్మంది నాదం రతివేదం
జతకోరే భ్రమర రాగం

రమ్మంది మోహం ఒక దాహం
మరులూరే భ్రమల మైకం
పరువాల వాహిని ప్రవహించే ఈవని
ప్రభవించే ఆమని పులకించే కామిని
వసంతుడే చెలికాంతుడై దరి చేరె మెల్లగా
విరిసినదీ వసంతగానం వలపుల పల్లవిగా

ఋతువు మహిమేమో
విరితేనె జడివానై కురిసె తియ్యగా

లతలు పెనవేయ మైమరిచి
మురిసేను తరువు హాయిగా
రాచిలుక పాడగా రాయంచ ఆడగా
రసలీల తోడుగా తనువెల్ల ఊగగా
మారుడే సుకుమారుడై జతకూడె మాయగా
విరిసినదీ వసంతగానం వలపుల పల్లవిగా
విరిసినదీ వసంతగానం వలపుల పల్లవిగా
మనసే మందారమై వయసే మకరందమై
అదేదో మాయ చేసినది
విరిసినదీ వసంతగానం వలపుల పల్లవిగా
విరిసినదీ వసంతగానం వలపుల పల్లవిగా



Credits
Writer(s): Sangeetham Srinivasa Rao, Madavapeddi Suresh
Lyrics powered by www.musixmatch.com

Link