Ghataina Prema Ghatana

ఘాటైన ప్రేమ ఘటన
ధీటైన మేటి నటన
అందంగా అమరిందిలే
ఇక ఆనందం మిగిలిందిలే
నిజమెరుగవే పసిచిలక
ఘాటైన ప్రేమ ఘటన
ధీటైన మేటి నటన
ఆనందం చిందించెలే
నా అందం నీ వశమాయెలే
తెరమరుగిక తొలగునులే

కోరుకున్నవాడే తగువేళ చూసి జతగూడే సుముహూర్తం ఎదురైనది
అందమైన ఈడే అందించమంటూ దరిచేరే సందేశం ఎద విన్నది
లేనిపోని లోని శంక మానుకోవె బాలిక
ఏలుకోవా గోరువంక లేత నీలి కానుక
కులుకా రసగుళిక కళలొలుక
తగు తరుణము దొరికెనుగా
ఘాటైన ప్రేమ ఘటన
ధీటైన మేటి నటన
ఆనందం చిందించెలే
నా అందం నీ వశమాయెలే
తెరమరుగిక తొలగునులే

పూజలన్నీ పండె పురివిప్పి నేను జతులాడి అనురాగం శృతి చేయగా
మోజులన్నీ పిండే మగతోడు చేరు ఈనాడు సుఖభోగం మొదలౌనుగా
ఊసులన్నీ మాలగా పూసగుచ్చివేయనా
రాచకన్నెనేలగా దూసుకొచ్చి వాలనా
కరిగా తొలకరిగా రసఝరిగా
అణువణువొక చినుకవగా
ఘాటైన ప్రేమ ఘటన
ధీటైన మేటి నటన
అందంగా అమరిందిలే
ఇక ఆనందం మిగిలిందిలే
నిజమెరుగవే పసిచిలక
ఘాటైన ప్రేమ ఘటన
ధీటైన మేటి నటన
ఆనందం చిందించెలే
నా అందం నీ వశమాయెలే
తెరమరుగిక తొలగునులే



Credits
Writer(s): Sirivennela Seetha Rama Shastry, M Suresh Chandra
Lyrics powered by www.musixmatch.com

Link