Yenduko Yemito

ఎందుకో ఏమిటో తొలిసారి నా గుండెలో
నీ ఊసులే మొదలాయెనే ఈ వేళ
ఎందుకో ఎమిటో నిదురింక రాదేమిటో
కనుపాపలో కల కాదుగా ఈ మాయ
ఎపుడూలేనిది... నాలో అలజడి
ఎవరూ చెప్పలేదే ప్రేమని
ఎందుకో ఏమిటో తొలిసారి నా గుండెలో
నీ ఊసులే మొదలాయెనే ఈ వేళ

ప్రేమనే మాటకి అర్ధమే నాకు రాదే
ఎవ్వరో చెప్పగా ఇప్పుడే తెలిసెనే
నీ జతే చేరగా నా కథే మారిపోయే
లోకమే బొత్తిగా గుర్తుకే రాదులే
చినుకై చేరినా వరదై పోయెనే
ఎవరూ ఆపలేరే ప్రేమని
ఎందుకో ఏమిటో తొలిసారి నా గుండెలో
నీ ఊసులే మొదలాయెనే ఈ వేళ

గాలిలో వేలితో ఆశలే రాసుకోనా
నీవనే ప్రేమని శ్వాశగా పీల్చనా
నీటిలో నీడలో నిన్నిలా చూసుకోనా
ఊహలో తేలుతూ ఊసులే ఆడనా
లోకం ఎంతగా మారిందే ఇలా
పగలే జాలువారే వెన్నెలా
ఎందుకో ఏమిటో తొలిసారి నా గుండెలో
నీ ఊసులే మొదలాయెనే ఈ వేళ



Credits
Writer(s): Kula Sekhar, R.p. Patnaik
Lyrics powered by www.musixmatch.com

Link