Peddaloddantunna

పెద్దలొద్దంటున్నా ప్రేమ తప్పని అన్నా
ఎవ్వరేమనుకున్నా जाने दीदो यार
నింగి పడిపోతున్నా నేల విడిపోతున్నా
నీరు నిప్పవుతున్నా जाने दीदो यार
प्यार किया तो डरना क्या

పెద్దలొద్దంటున్నా ప్రేమ తప్పని అన్నా
ఎవ్వరేమనుకున్నా जाने दीदो यार

విధినైనా ఎదిరిస్తుంది
ఎదలో నిండి ఈ ప్రేమా
వద్దన్నా మనసిస్తుంది
వరమౌతుంది ఈ ప్రేమా
చరితల్లో గెలిచింది ప్రేమే కదా
జగమంతా నిండింది ప్రేమే కదా
ఎన్ని హద్దులున్నా ఓడిపోదు ప్రేమ
ఎల్లలెన్ని ఉన్నా తలవంచునా
प्यार किया तो डरना क्या
పెద్దలొద్దంటున్నా ప్రేమ తప్పని అన్నా
ఎవ్వరేమనుకున్నా जाने दीदो यार

కలలైనా కలకాలేదు
కలిసిందంటే ఈ ప్రేమ
క్షణమైనా ఎడబాటేగా
ముడివేసాక ఈ ప్రేమ
ఆరారు కాలాల అందం కదా
ఏడేడు జన్మాల బంధం కదా
ప్రేమ లేని చోటా
బతుకు ముళ్ళ బాటా
ప్రేమ తోడు ఉంటే గెలుపేనటా
प्यार किया तो डरना क्या

పెద్దలొద్దంటున్నా ప్రేమ తప్పని అన్నా
ఎవ్వరేమనుకున్నా जाने दीदो यार
నింగి పడిపోతున్నా నేల విడిపోతున్నా
నీరు నిప్పవుతున్న జానే దిదో యార్
प्यार किया तो डरना क्या



Credits
Writer(s): Rabindra Prasad Pattnaik, Peddada Murthy
Lyrics powered by www.musixmatch.com

Link