Are Emaindhi (From "Aaradhana")

అరే ఏమైందీ

అరే ఏమైందీ
ఒక మనసుకు రెక్కలొచ్చి
ఎక్కడికో ఎగిరిందీ
అది ఏమైందీ
తన మనిషిని వెతుకుతు
ఇక్కడొచ్చి వాలిందీ
కలగాని కల ఏదో కళ్ళెదుటే నిలిచిందీ
అది నీలో మమతను నిద్దుర లేపిందీ
అరే ఏమైందీ
ఒక మనసుకు రెక్కలొచ్చి
ఎక్కడికో ఎగిరిందీ
అది ఏమైందీ

నింగి వంగి నేలతోటి
నేస్తమేదో కోరింది
నేలపొంగి నింగికోసం పూలదోసిలిచ్చింది
పూలునేను చూడలేను పూజలేవి చేయలేను
నేలపైన కాళ్ళులేవు నింగివైపు చూపులేదు
కన్నెపిల్ల కళ్ళలోకి ఎన్నడైన చూశావో
కానరాని గుండెలోకి కన్నమేసి వచ్చావో
అది దోచావో

లలలల లా లలలల లా
లలలల లా లలలల లా
లలలల లా లల లల లల లల లల లలలా

బీడులోన వానచినుకు పిచ్చిమొలక వేసింది
పాడలేని గొంతులోన పాట ఏదో పలికింది
గుండె ఒక్కటున్న చాలు గొంతుతానే పాడగలదు
మాటలన్నీ దాచుకుంటే పాట నీవు రాయగలవు
రాతరాని వాడిరాత దేవుడేమి రాశాడో
చేతనైతే మార్చిచూడు వీడు
మారిపోతాడు మనిషౌతాడు
అరే ఏమైందీ
ఒక మనసుకు రెక్కలొచ్చి
ఎక్కడికో ఎగిరిందీ
అది ఏమైందీ
తన మనిషిని వెతుకుతు
ఇక్కడొచ్చి వాలిందీ
కలగాని కల ఏదో కళ్ళెదుటే నిలిచింది
అది నీలో మమతను నిద్దుర లేపింది

అరే ఏమైందీ
ఒక మనసుకు రెక్కలొచ్చి
ఎక్కడికో ఎగిరిందీ
అది ఏమైందీ



Credits
Writer(s): Ilayaraja, Acharya Atreya
Lyrics powered by www.musixmatch.com

Link