Naginivo

నాగినివో భోగినివో కామకళా యోగినివో
వెన్నెలకి విభావనివో, జాబిలికి సహోదరివో
పానుపైనది నా ప్రాయం మసక రాతిరిలో
నాగినివో భోగినివో కామకళా యోగినివో
నాగవిభో నాకు ప్రభో నాట్యకళా నాధుడవో
కన్నెలకి వసంతుడివో, ఆమనిలో అనంతుడవో
కాటు కోరెను నా అందం కౌగిలింతలలో
నాగినివో భోగినివో కామకళా యోగినివో

చందనాల చెట్టు కింద తందనాలా పక్కవేశా
సాగనీరా రాసలీల
కుసమే విడినా కుర్రదానా రోసమే చూపనా రొంటిమీనా
వాటేస్తావో, కాటేస్తావో చాటే ముందే సర్పక్రీడల్లో
నాగినివో భోగినివో కామకళా యోగినివో
కన్నెలకి వసంతుడివో, ఆమనిలో అనంతుడవో
పానుపైనది నా ప్రాయం మసక రాతిరిలో
నాగవిభో నాకు ప్రభో నాట్యకళా నాధుడవో

నాగులేటి కోనలోన రేవులేని నావలాగా
రేగిపోనా రెచ్చిపోనా
పుట్టలో పాలనే పోసుకోరా పూతలో తేనెలే దోచుకోరా
ఉయ్యాలూగే వయ్యారాలే ఒళ్ళోకొచ్చే నాగానందంలో
నాగవిభో నాకు ప్రభో నాట్యకళా నాధుడవో
వెన్నెలకి విభావనివో, జాబిలికి సహోదరివో
కాటు కోరెను నా అందం కౌగిలింతలలో
నాగినివో భోగినివో
నాగవిభో నాకు ప్రభో



Credits
Writer(s): Raj-koti, Veturi
Lyrics powered by www.musixmatch.com

Link