Allei Allei

ఆశ ఆగనందే
నిన్ను చూడకుంటే
శ్వాస ఆడనందే
అంత దూరముంటే
నన్నే మల్లె తీగలా నువ్వు అల్లకుంటే
నిలువెత్తు ప్రాణం నిలవదటే
అల్లేయ్ అల్లేయ్, అల్లేయ్ అల్లేయ్
నా చిట్టి చిలక జట్టై అల్లేయి
అల్లేయ్ అల్లేయ్, అల్లేయ్ అల్లేయ్
ఏమంత అలక చాల్లే అల్లేయ్

నిను వెతికే నా కేకలకు మౌనమే బదులైందే
మౌనములో నీ మాటిదని మనసే పోల్చుకుందే
లాలన చేసే వీలే లేని పంతం వదిలి పలకవటే
అల్లేయ్ అల్లేయ్, అల్లేయ్ అల్లేయ్
పుప్పొడి తునక గాలై అల్లేయ్
అల్లేయ్ అల్లేయ్, అల్లేయ్ అల్లేయ్
పన్నీటి చినుకా జల్లై అల్లేయ్
హో...
ముడిపడి పోయామొక్కటిగా విడివడి పోలేక
కాదనుకున్నా తప్పదుగా వాదన దేనికిక...
పదునుగ నాటే మన్మధ బాణం నేరం ఏమి కాదు కదే
అల్లేయ్ అల్లేయ్, అల్లేయ్ అల్లేయ్
నా జత గువ్వా జట్టై అల్లేయ్
అల్లేయ్ అల్లేయ్, అల్లేయ్ అల్లేయ్
నా చిరునవ్వా జల్లై అల్లేయ్



Credits
Writer(s): A.r. Rahman, Sirivennela Seetharama Sastry
Lyrics powered by www.musixmatch.com

Link