Sandya Ragapu (From "Indhrudu Chandhrudu")

సంధ్యా రాగపు సరిగమలో తొలి కలయికలో
సాయంకాలపు చలి చలి ఊహల పకపకలో
డోరేమి రాగాల జోరేమి
ద స ద నా ప్రేమ నీ మీద శ్రుతి కలిసిన

సంధ్యా రాగపు సరిగమలో తొలి కలయికలో
సాయంకాలపు చలి చలి ఊహల పకపకలో

చినుకు చినుకు నడుములో చిలుకలులికి పడునులే
కనుల కనుల నడుములో అలల సుడులు తిరిగెలే
పెదవి పెదవి తడుపులో వలపు మధువు తొలిపేలే
తనువు తనువు కదుపులో తమకమొకటి మెరిసెలే
సంధ్యలో తారలాగా స్వప్నమైపోకుమా
కన్నెలో సోయగాలు కంటితోనే తాగుమా
హంసలా హాయిగా ఆమని రేయిలా వాలిపో ప్రియా

సంధ్యా రాగపు సరిగమలో తొలి కలయికలో
సాయంకాలపు చలి చలి ఊహల పకపకలో
డోరేమి రాగాల జోరేమి
ద స ద నా ప్రేమ నీ మీద శ్రుతి కలిసిన
సంధ్యా రాగపు సరిగమలో తొలి కలయికలో
సాయంకాలపు చలి చలి ఊహల పకపకలో

ఎదుట పడిన బిడియమే చెమట నుదుట చిలికెలే
వణుకు తొణుకు పరువమే బడికి వయసు కలిపెలే
వలపు పొడుపు కథలలో చిలిపి ముడులు విడెనులే
మరుల విరుల పొదలలో మరుడి పురుడు జరిగెలే
తేనెలే దోచుకెళ్లే తుమ్మెదైగపోకుమా
గాలికే గంధమిచ్చే కౌగిలింతే దూరమా
పాటల తోటలో పల్లవే ప్రేమగా పాడుకో ప్రియా

సంధ్యా రాగపు సరిగమలో తొలి కలయికలో
సాయంకాలపు చలి చలి ఊహల పకపకలో
డోరేమి రాగాల జోరేమి
ద స ద నా ప్రేమ నీ మీద శ్రుతి కలిసిన
సంధ్యా రాగపు సరిగమలో తొలి కలయికలో
సాయంకాలపు చలి చలి ఊహల పకపకలో



Credits
Writer(s): Ilayaraja, Veturi
Lyrics powered by www.musixmatch.com

Link