Sinne Sinne Korikaladaga (From "Swayam Krishi")

సిన్ని సిన్ని కోరికలడగ శీనీవాసుడు నన్నడగ
అన్నులమిన్న అలమేల్మంగై ఆతని సన్నిధి కొలువుంట

ఎరిగిన మనసుకు ఎరలేలే
ఏలిక సెలవిక శరణేలే
ఎరిగిన మనసుకు ఎరలేలే
ఏలిక సెలవిక శరణేలే
ఎవరికి తెలియని కధలివిలే
ఎవరికి తెలియని కధలివిలే
ఎవరో చెప్పగా ఇక ఏలే

సిన్ని సిన్ని కోరికలడగ శీనీవాసుడు నన్నడగ
అన్నులమిన్న అలమేల్మంగై ఆతని సన్నిధి కొలువుంట

నెలత తలపులే నలుగులుగా
కలికి కనులతో జలకాలు ఉ ఉ ఉ
నెలత తలపులే నలుగులుగా
కలికి కనులతో జలకాలు
సందిటనేసిన చెలువములే
సందిటనేసిన చెలువములే
సుందరమూర్తికి చేలములు

సిన్ని సిన్ని కోరికలడగ శీనీవాసుడు నన్నడగ
అన్నులమిన్న అలమేల్మంగై ఆతని సన్నిధి కొలువుంట

కలల ఒరుపులే కస్తురిగా
వలపు వందనపు తిలకాలు
వలపు వందనపు తిలకాలు
అంకముజేరిన పొంకాలే
అంకముజేరిన పొంకాలే
శ్రీవేంకటపతికిక వేడుకలు ఉహు ఉహు ఉ

సిన్ని సిన్ని కోరికలడగ శీనీవాసుడు నన్నడగ
అన్నులమిన్న అలమేల్మంగై ఆతని సన్నిధి కొలువుంట
సిన్ని సిన్ని కోరికలడగ శీనీవాసుడు నన్నడగ
అన్నులమిన్న అలమేల్మంగై ఆతని సన్నిధి కొలువుంట

Credits
Writer(s): Sirivennala Seetharama Shastry, Ramesh Naidu
Lyrics powered by www.musixmatch.com

Link