Andamaina Premarani (From "Premikudu")

అందమైన ప్రేమరాణి చెయ్యి తగిలితే
సత్తురేకు కూడా స్వర్ణమేలే
అందమైన ప్రేమరాణి లేత బుగ్గపై
చిన్న మొటిమ కూడా ముత్యమేలే
చెమట నీరే మంచి గంధం
ఓర చూపే మోక్ష మార్గం
వయసుల సంగీతమే
ఊహూ భూమికే భూపాలమే
వయసుల సంగీతమే
ఊహూ భూమికే భూపాలమే

సానిసా సారిగారి సానిసానిసాని
సానిసా సాగమామపమాగారీస
సానిసా సారిగారినీ సానిపానిసానిసా
సాగమమమ మాప మాగరీస

అందమైన ప్రేమ రాణి ఉత్తరాలలో
పిచ్చిరాతలైన కవితలవునులే
ప్రేమకెపుడు మనసులోన భేదముండదే
ఎంగిలైన అమృతమ్ములే
గుండుమల్లి ఒక్క రూపాయి
నీ కొప్పులోన చేరితే కోటి రూపాయలు
పీచు మిఠాయ్ అర్దరూపాయి
నువ్వు కొరికి ఇస్తే దాని విలువ లక్షరుపాయలు

అందమైన ప్రేమరాణి చెయ్యి తగిలితే
సత్తురేకు కూడా స్వర్ణమేలే
అందమైన ప్రేమరాణి లేత బుగ్గపై
చిన్న మొటిమ కూడా ముత్యమేలే
చెమట నీరే మంచి గంధం
ఓర చూపే మోక్ష మార్గం
వయసుల సంగీతమే
ఊహూ భూమికే భూపాలమే
వయసుల సంగీతమే
ఊహూ భూమికే భూపాలమే

ప్రేమ ఎపుడు ముహుర్తాలు చూసుకోదులే
రాహుకాలం కూడా కలిసి వచ్చులే
ప్రేమ కొరకు హంస రాయబారమేలనే
కాకి చేత కూడా కబురు చాలులే
ప్రేమ జ్యోతి ఆరిపోదే
ప్రేమబంధం ఎన్నడూ వీడిపోదే
ఇది నమ్మరానిది కానేకాదే
ఈ సత్యం ఊరికీ తెలియలేదే
ఆకాశం భూమి మారినా మారులే
కానీ ప్రేమ నిత్యమే
ఆది జంట పాడిన పాటలే ఇంకా వినిపించులే

ప్రేమ తప్పు మాటని ఎవ్వరైన చెప్పినా
నువ్వు బదులు చెప్పు మనసుతో
ప్రేమ ముళ్ళ బాట కాదు వెళ్ళవచ్చు
అందరూ నువ్వు వెళ్ళు నిర్భయంగా



Credits
Writer(s): A R Rahman, Rajaram Shinde Rajashree
Lyrics powered by www.musixmatch.com

Link