Bhoomiki Pachhani (From "Sri Ramulayya")

భూమికి పచ్చాని రంగేసినట్టు అమ్మలాలా
పంటచేలు పెరగాలి ఓయమ్మలాలో అమ్మలాలా
ఆలి పుస్తెలమ్ముకొని అప్పు తీర్చుకుంటివో అమ్మలాలా
వలవలవల ఏడ్చుకుంటూ వలసెళ్ళిపోతివో అమ్మలాలా
పురుగులమందే నీకు పెరుగన్నమాయెనో అమ్మలాలా
చెరవీడి భూతల్లి చెంతకు చేరిందిరో
పంటలు చేతికొస్తే పండుగ చేద్దామురో

భూమికి పచ్చాని
భూమికి పచ్చాని
భూమికి పచ్చాని రంగేసినట్టు అమ్మలాలా
పంటచేలు పెరగాలి ఓయమ్మలాలో అమ్మలాలా

జాతరమ్మ జాతరమ్మ కూలిజనం జాతరో అమ్మలాలా
ఎత్తుపల్లాలనే చదును చేసే జాతరో అమ్మలాలా
చేలుదున్ని చాళ్లుదీసే బీదబిక్కి జాతరో అమ్మలాలా
ఎద్దుకొమ్ముల నడుమ ఎర్రపొద్దు పొడిచెరో
భూస్వామి గుండెలదర గుడిసెలోళ్ళ జాతర

భూమికి పచ్చాని
భూమికి పచ్చాని
భూమికి పచ్చాని రంగేసినట్టు అమ్మలాలా
పంటచేలు పెరగాలి ఓయమ్మలాలో అమ్మలాలా

చెమటజల్లు చిలకరిస్తే నేల పులకరించురో అమ్మలాలా
వానొస్తే భూతల్లి శీమంతమాడురో అమ్మలాలా
తంగేళ్లు గన్నేర్లు పసుపుకుంకుమిచ్చురో అమ్మలాలా
పశుల మెడన చిరుగజ్జెలు ఘల్లున మ్రోగేనో
గజ్జెల మోతల్లో పల్లె పరవశించెనో

భూమికి పచ్చాని
భూమికి పచ్చాని
భూమికి పచ్చాని రంగేసినట్టు అమ్మలాలా
పంటచేలు పెరగాలి ఓయమ్మలాలో అమ్మలాలా

ఎగువ పెన్నమ్మతల్లి ఎగిరెగిరి దుంకితే అమ్మలాలా
తుంగభద్రమ్మ పొంగి పరవళ్లు తొక్కితే అమ్మలాలా
చిత్రంగా చిత్రావతి చిందులు ఆడితే అమ్మలాలా
నేలతల్లి నీళ్లాడి పసిడిపంటలిచ్చురో
నా సీమకన్నుల్లో వెలుగులు నిండేనురో

భూమికి పచ్చాని
భూమికి పచ్చాని
భూమికి పచ్చాని రంగేసినట్టు అమ్మలాలా
పంటచేలు పెరగాలి ఓయమ్మలాలో అమ్మలాలా



Credits
Writer(s): Vandematharam Srinivas, Kalekoori Prasad
Lyrics powered by www.musixmatch.com

Link