Malle Theegaku (From "Orey Rikshaw")

ఆ మల్లెతీగకు పందిరివోలె
మస్క సీకటిలో వెన్నెలవోలె
నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా
తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా
నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా
తోబుట్టూ రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా
(ముళ్ళ తీగమ్మా కంచే మీదా)
(చీరా వేస్తే రానేరాదమ్మా)
(ఆడపిల్లమ్మా రెప్పా రెప్పా)
(విప్పూకుంటూ చూస్తే తప్పమ్మా)

పెద్ద మనిషివై పూసిన నుండే
ఆడపిల్లపై ఆంక్షలు ఎన్నో
చూసే దానిని చూడొద్దంటరు
నవ్వేచోట నవ్వొద్దంటరు
పెద్ద మనిషివై పూసిన నుండే
ఆడపిల్లపై ఆంక్షలు ఎన్నో
చూసే దానిని చూడొద్దంటరు
నవ్వేచోట నవ్వొద్దంటరు
అటువంటి నీ అన్ననుగాను చెల్లెమ్మా
నీ చిన్ననాటి స్నేహితునమ్మా చెల్లెమ్మా
అడవిలోన నెమలివోలె చెల్లెమ్మా
ఆటలాడుకో పాటపాడుకో చెల్లెమ్మా

మల్లెతీగకు పందిరివోలె
మస్క సీకటిలో వెన్నెలవోలె చెల్లెమ్మా
(ఆడపిల్లకి అగ్గిపుల్లమ్మా ఓయమ్మా)
(ఎవరి కంటపడ్డా మండిపోవునమ్మా)
(ఆహూమ్ ఆహూమ్)
(అడపిల్లంటే ఇంటికి భారము ఓయమ్మా)
(కన్నవాళ్లకే రోకలి పోటమ్మా)
(ఆహుమ్ ఆహుమ్)

సిన్నబోయి నువు కూసున్నవంటే
ఎన్నుపూస నాదిరిగేనమ్మా
ఒక్కక్షణము నువు కనబడకుంటే
నా కనుపాపలు కమిలిపోతయి
సిన్నబోయి నువు కూసున్నవంటే
ఎన్నుపూస నాదిరిగేనమ్మా
ఒక్కక్షణము నువు కనబడకుంటే
నా కనుపాపలు కమిలిపోతయి
ఒక్క ఘడియ నువు మాటాడకుంటే చెల్లెమ్మా
నే దిక్కులేని పక్షినైతానమ్మా చెల్లెమ్మా
బువ్వ తినక నువు అలిగినవంటే చెల్లెమ్మా
నా భుజం ఇరిగినంత పనైతదమ్మా చెల్లెమ్మా

మల్లెతీగకు పందిరివోలె
మస్క సీకటిలో వెన్నెలవోలె చెల్లెమ్మా

(ఇల్లువాకిలి వదిలి పెట్టి)
(ఆడపిల్ల బడికి వెళ్లి)
(భుజం తొక్కే చదువు చదివేదెందుకు)
(ఆ కట్నకానుకలిచ్చి సచ్చేటందుకు)
(ఆ కట్నకానుకలిచ్చి సచ్చేటందుకు)

చదివినంత నిన్ను చదివిస్తనమ్మా
ఎదిగినంత నిన్ను ఎదిగిస్తనమ్మా
నీకు పెళ్ళీడు వచ్చేనాటికి
పువ్వో పత్రో కూడబెట్టుతా
చదివినంత నిన్ను చదివిస్తనమ్మా
ఎదిగినంత నిన్ను ఎదిగిస్తనమ్మా
నీకు పెళ్ళీడు వచ్చేనాటికి
పువ్వో పత్రో కూడబెట్టుతా
నచ్చినోనికే ఇస్తానమ్మా చెల్లెమ్మా
నా కన్నీళ్ళతో కాళ్లు కడుగుతా చెల్లెమ్మా
రిక్షా బండినే మేనా గడతా చెల్లెమ్మా
మీ అత్తోరింటికి సాగనంపుతా చెల్లెమ్మా

మల్లెతీగకు పందిరివోలె
మస్క సీకటిలో వెన్నెలవోలె
నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా
తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా
నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా
తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా
తోబుట్టూ రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా
తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా



Credits
Writer(s): Vandematharam Srinivas, Gaddar
Lyrics powered by www.musixmatch.com

Link