Kopam Vasthe

Movie: Tarakaramudu
Music: Koti
Lyrics: Sirivennela

కోపంవస్తే మండుటెండ
మనసు మాత్రం వెండి కొండ
కోపంవస్తే మండుటెండ మనసు మాత్రం వెండి కొండ వాన మబ్బులాంటి వాటం నీదయా
నాకు తెలుసా మంచి చెడ్డా నువ్వు చెబితే నేర్చుకుంటా నిన్ను నమ్మినాను అంతా నీదయ
నీ అల్లర్లు అందం నీ అలకల్లు అందం నన్ను కవ్వించి నవ్వించి నీ నేస్తమే మంచి గంధం
కోపంవస్తే మండుటెండ మనసు మాత్రం వెండి కొండ వాన మబ్బులాంటి వాటం నీదయా...

చరణం: 1
చెర్లో వున్న చాకిరేవు బండ నేనట గుళ్ళో వున్న అమ్మవారి బొమ్మనీవట
మురికిని కడిగినా మనసుని కడిగినా రెండు రాళ్ళు చేసేదోకటే పేర్లేవేరటా
అవునోకాదో తెలియదు కానీ నువ్వుచెబుతుంటే అవునంట
మరిఅంతలోనే బుంగమూతి సంగతేంటటా
నాకు తెలుసా మంచి చెడ్డా నువ్వు చెబితే నేర్చుకుంటా నిన్ను నమ్మినాను అంతా నీదయా...

చరణం: 2
నిండు కుండ కాదు కనుక తొనుకుతున్నది అంత వింత అందులోన ఏమిటున్నది
నాలో తెలివికి దీన్లో నీటికి పోలిగుళుకు గుళుకు పలుకుతున్నది
అమృతం లాంటి హృదయం నీది అంత కన్నా వేరే వరమేది
అది తెలిసి కూడా కసురుకుంటే నేరమెవరిదీ
కోపంవస్తే మండుటెండ మనసు మాత్రం వెండి కొండ వాన మబ్బులాంటి వాటం నీదయా
ఏందో!! నాకు తెలుసా మంచి చెడ్డా నువ్వు చెబితే నేర్చుకుంటా నిన్ను నమ్మినాను అంతా నీదయా
నీ అల్లర్లు అందం నీ అలకల్లు అందం నన్ను కవ్వించి నవ్వించి నీ నేస్తమే మంచి గంధం

Singers: K. S. Chitra, S. P. Balu



Credits
Writer(s): Raj-koti, Sirivennela Sitarama Sastry
Lyrics powered by www.musixmatch.com

Link