Ramudu Manchi

రాముడు మంచి బాలుడు అని అంత అంటారు
నన్ను జూసి అంతా అంటారు
రాముడు మంచి బాలుడు అని అంత అంటారు
నన్ను జూసి అంతా అంటారు
ఆహ క్షేమమేనా అబ్బి అంటే నావాళవుతారు
పాద మాగిన చోటే సొంతూరు
ఆదరించిన వాళ్లే అయినోళ్లు
కాదు పోరా అంటే రారా అంటది రేపిన్కో ఊరు

రాముడు మంచి బాలుడు అని అంత అంటారు
నన్ను జూసి అంతా అంటారు
ఆహ క్షేమమే నా అబ్బి అంటే నావాళవుతారు
వాళ్ళే నావాళవుతారు

గాలి లాలి పాడే నెల తల్లి ఒళ్ళో
ఆదమరిచి నేను నిద్దరవుతాను

వెన్ను తట్టి లేపే పిట్ట పాత వింటూ
మేలుకొని నేను సూర్యుడవుతాను
అష్టదిక్కుల మధ్యన నేను దిక్కులేనివాడిని కాదు
చుట్టు పక్కల ఉండేవాళ్లే చుట్ట పక్కాలనుకుంటాను
గడ్డి పూవులు కూడా నాకు నవ్వులెన్నో నేర్పించాయి
గుబ్బి గవ్వలు కూడా నాకు ఆడుకుందుకు పనికొచ్చాయి
దుఃఖం అంటే మాత్రం అర్థం చెప్పలేదు ఎవరు

రాముడు మంచి బాలుడు అని అంత అంటారు
నన్ను జూసి అంతా అంటారు
ఆహ క్షేమమే నా అబ్బి అంటే నావాళవుతారు
వాళ్ళే నావాళవుతారు

ఓయ్ రాముడోయ్ కాస్త చంటిగాడిని చూస్కో
అట్టాగేనక్క

ఆయీ ఆయీ నంటూ ఊయలూపుతాను
చిన్ని తల్లి నీకు అమ్మనవుతాను
అమ్మలాగే నాకు అన్నంపెట్టు చాలు
ఆయువున్నదాకా అమ్ముడువుతాను
నువ్వు వరస కలుపుకుంటే
నీ కొడుకు నవకపోను
నాకు చేతనైన సేవ నీకు చేయలేకపోను
మన సొంతం అంటూ వేరే ఏ బంధం లేదంటారు
మనమంతా మానవులమే ఆ బంధం చాలంటారు
అనుకోవడంలోనే అంతావుందని పెద్దలు అంటారు

రాముడు మంచి బాలుడు అని అంత అంటారు
నన్ను జూసి అంతా అంటారు
రాముడు మంచి బాలుడు అని అంత అంటారు
నన్ను జూసి అంతా అంటారు
ఆహ క్షేమమేనా అబ్బి అంటే నావాళవుతారు
పాద మాగిన చోటే సొంతూరు
ఆదరించిన వాళ్లే అయినోళ్లు
కాదు పోరా అంటే రారా అంటది రేపిన్కో ఊరు



Credits
Writer(s): Raj-koti, Sirivennela Sitarama Sastry
Lyrics powered by www.musixmatch.com

Link