Chettumedhi Usiri

సెట్టు మీది ఉసిరికి
సంద్రాన ఉప్పుకి
సుట్టరికం పెట్టాడు
సిత్తరాల దేవుడు

ఆ సెట్టు మీది ఉసిరికి
ఈ సంద్రాన ఉప్పుకి
సుట్టరికం పెట్టాడు
సిత్తరాలదేవుడు
మబ్బులోని నీరుకి
మట్టి సాటు వేరుకి
వాన వద్దనేశాడు
జాడలేని దేవుడు

కలవనట్టు అనిపిస్తాది
నేలా ఆకాశం
తెలుసుకుంటే కనిపిస్తాది
తెగిపోని సావాసం
కలవనట్టు అనిపిస్తాది
నేలా ఆకాశం
తెలుసుకుంటే కనిపిస్తాది
తెగిపోని సావాసం

జన్మలున్నవో లేవో
ఆ భమ్మదేవుడి కి ఎరుక
జన్మలున్నవో లేవో
ఆ బెమ్మదేవుడి కి ఎరుక
ఆ కొమ్మకి నీకు ఋణమేటంటే
సెప్పగలదా సిలకా
చెప్పగలదా సిలకా
చెప్పగలదా సిలకా



Credits
Writer(s): Raj-koti, Sirivennela Sitarama Sastry
Lyrics powered by www.musixmatch.com

Link