Nee Kallathoti

నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనే చంద్రోదయం
నీ చూపుతోటి నను తాకుతుంటే తనువంతా సూర్యోదయం
ఇలాగే ఇలాగే మనం ఏకమయ్యే క్షణాలే కదా ఓ వరం
అలాగే అలాగే ప్రపంచాలు పలికే కథవ్వాలి మనమిద్దరం
నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనే చంద్రోదయం
నీ చూపుతోటి నను తాకుతుంటే తనువంతా సూర్యోదయం

అడుగునౌతాను నీవెంట నేను తోడుగా నడవగా చివరిదాకా
గొడుగునౌతాను ఇకపైన నేను వానలో నిన్నిలా తడవనీక
నిన్నొదిలి క్షణమైన అసలుండలేను చిరునవ్వునౌతాను పెదవంచున
నీ లేత చెక్కిళ్ళ వాకిళ్ళలోనే తొలిసిగ్గు నేనవ్వనా
నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనే చంద్రోదయం
నీ చూపుతోటి నను తాకుతుంటే తనువంతా సూర్యోదయం

వెన్నెలౌతాను ప్రతి రేయి నేను చీకటే నీ దరికి చేరకుండా
ఊపిరౌతాను నీలోన నేను ఎన్నడూ నీ జతే వదలకుండా
నా రాణి పాదాలు ముద్దాడుకుంటూ నేనుండిపోతాను పారాణిలా
చిరు చెమట పడుతుంటే నీ నుదుటిపైన వస్తాను చిరుగాలిలా

Credits
Writer(s): Devi Sri Prasad, Chandrabose
Lyrics powered by www.musixmatch.com

Link