Anando

ఆనందో బ్రహ్మ గోవిందో हार
నీ పేరే ప్రేమ నా పేరే प्यार
సన్నజాజి పువ్వులాంటి కన్నెపిల్ల కన్నుగీటితే
చాకులాంటి కుర్రవాడు బాకులాంటి చూపు గుచ్చి ఏమిటెప్పుడంటుంటే

ఆనందో బ్రహ్మ గోవిందో हार
నీ పేరే ప్రేమ నా పేరే प्यार

గాలి మళ్లుతున్నది పిల్ల జోలికెళ్లమన్నది
లేత లేతగున్నది పిట్టకూతకొచ్చి ఉన్నది
కవ్వించే miss-u కాదన్నాkiss-u
నువ్వైతే plus-u ఏనాడో yes-u
Close-upలో కొత్త మోజిప్పుడే వింతగా ఉంటే
మోహాలలో పిచ్చి దాహాలతో మత్తుగా ఉంటే
వెన్నెలంటి ఆడపిల్ల వెన్నుతట్టి రెచ్చగొట్టగా సరాగమాడే వేళ

ఆనందో బ్రహ్మ గోవిందో हार
నీ పేరే ప్రేమ నా పేరే प्यार
సన్నజాజి పువ్వులాంటి కన్నెపిల్ల కన్నుగీటితే
చాకులాంటి కుర్రవాడు బాకులాంటి చూపు గుచ్చి ఏమిటెప్పుడంటుంటే

Life-u bore-uగున్నది కొత్త కైపు కోరుతున్నది
గోల గోలగున్నది ఈడు గోడదూకమన్నది
నువ్వే నా luck-u నీ మీదే హక్కు
పారేస్తే look-u ఎక్కింది kick-u
నీ బాణమే కొంటె కోణాలతో మెత్తగా తాకే
నా ఈలకే ఒళ్లు ఉయ్యాలగా హాయిగా తేలే
సింగమంటి చిన్నవాడు చీకటింట దీపమెట్టగా వసంతమాడే వేళ

ఆనందో బ్రహ్మ గోవిందో हार
నీ పేరే ప్రేమ నా పేరే प्यार
సన్నజాజి పువ్వులాంటి కన్నెపిల్ల కన్నుగీటితే
చాకులాంటి కుర్రవాడు బాకులాంటి చూపు గుచ్చి ఏమిటెప్పుడంటుంటే

ఆనందో బ్రహ్మ గోవిందో हार
నీ పేరే ప్రేమ నా పేరే प्यार

Credits
Writer(s): Ilayaraja, Veturi
Lyrics powered by www.musixmatch.com

Link