Enniyalo

ఎన్నియల్లో మల్లియల్లో ఎన్నెన్ని అందాలో
కవ్వింతల్లో తుళ్లింతల్లో ఎన్నెన్ని కావ్యాలో
ఒంపుల్లో ఉన్న హంపి శిల్పాలు
ఒళ్లంటుకుంటే చాలు నాట్యాలు
శృంగార వీణరాగాలే హోయ్
ఎన్నియల్లో మల్లియల్లో ఎన్నెన్ని అందాలో
కవ్వింతల్లో తుళ్లింతల్లో ఎన్నెన్ని కావ్యాలో

సిగ్గేయగా బుగ్గ మొగ్గ మందార ధూళే దులిపే
జారేసిన పైటంచున అబ్బాయి కళ్లే నిలిపే
సందిళ్లకే చలివేస్తుంటే అందించవా సొగసంతా
ఒత్తిళ్లతో ఒలికేస్తుంటే వడ్డించనా వయసంతా
వెలుగులో కలబడే కలలు కన్నా
తనువులో తపనలే కదిపినా కథకళిలోన
ఎన్నియల్లో మల్లియల్లో ఎన్నెన్ని అందాలో
కవ్వింతల్లో తుళ్లింతల్లో ఎన్నెన్ని కావ్యాలో

ఈ చీకటే ఓ చీరగా నా చాటు అందాలడిగే
ఈ దివ్వెలా క్రీనీడలే నీ సోకులన్నీ కడిగే
నీ మబ్బులే గుడి కడుతుంటే జాబిల్లిలా పడుకోనా
తబ్బిబ్బుతో తడబడుతుంటే నీ గుండెలో నిదరోనా
ఉదయమే అరుణమై ఉరుముతున్నా
చెదరనీ నిదరలో కుదిరిన పడకలలోన
ఎన్నియల్లో మల్లియల్లో ఎన్నెన్ని అందాలో
కవ్వింతల్లో తుళ్లింతల్లో ఎన్నెన్ని కావ్యాలో
ఒంపుల్లో ఉన్న హంపి శిల్పాలు
ఒళ్లంటుకుంటే చాలు నాట్యాలు
శృంగార వీణరాగాలే హోయ్
ఎన్నియల్లో మల్లియల్లో ఎన్నెన్ని అందాలో
లలాలాలా లలాలాలా



Credits
Writer(s): Veturi Murthy, Ilayaraja I
Lyrics powered by www.musixmatch.com

Link