Akhilathmakudu

అఖిలాత్మకుడు
పల్లవి: అఖిలాత్మకుడు హరి ఇది నిక్కమూ
పరమపదమునకు వారధి ఇదినిజము [అఖిలా] [2]
చరణం: పెనుసాగరమును ఈదుట బహు కష్టం
కారడవులదూరు అతికష్టమూ [2]
కఠినాత్ముని మనసు కరగుట దుర్లభం
వానిపై కరుణ గురిపించిన శూన్యం [అఖిలా] [2]
చరణం: దయాసాగరము బొందుట బహు కష్టం
భవసాగరమును ఈదుట గగనము [2]
ఆకసమునంచున తిలకించు యత్నము
నింగీ నేలల ఏకమూ బహు కష్టం [అఖిలా] [2]
చరణం: యోగుల శాపము వెనుదీయుట కష్టము
మూర్ఖుల మనసును మలపుట అతి కష్టం [2]
మరి తరచి చూచిన మానుష జన్మము [2]
పొందుటె దుర్లభం బహు కష్ట తరము [అఖిలా] [2]
చరణం: దానవాంతకుడు హరి కరుణ మనపైన
యున్నఅన్నియు సుసాధ్య మేనన్నా [2]
కనిపించు దుర్గములు పూలదారులై
సులభ సాధ్యములు కరతలామలకములు [అఖిలా] [2]
చరణం: అచ్యుతానంతుడు గోవిందుడు
పరమాత్ముడు ఆ నారాయణుడు [2]
ముజ్జగముల నేలు జగదాత్మజునికి [2]
జయమంగళం నిత్య శుభమంగళం [అఖిలా] [2]



Credits
Writer(s): Lakshmi Valli Devi Bijibilla
Lyrics powered by www.musixmatch.com

Link