Anandam

ANANDAM
పల్లవి: ఆనందం, జగదానందం
సహస్ర దీపం, సంధ్యా సమయం [2]
చరణం: ఉభయ దేవేరీ సహితుండై
కొలువు దీరెను, వేంకట రమణుడు [2]
సహస్ర ప్రభల, కాంతి వెలుగులో [2]
వెలిగేనూ, చిన్మయ రూపుడు [ఆనందం]
చరణం: అజ్ఞానమను దివ్వెలలో
సుజ్ఞానమనే తైలము నింపి [2]
వెలుగు దివ్వెలు, ప్రోలెను ఆత్మలు [2]
కాంతులీను, శ్రీ కాంతుని జూడగ [ఆనందం]
చరణం: ముగ్ధ మోహనుడు, శ్రీ వేంకటేశుడు
ఓర జూపుల, మురిపించె సతుల [2]
మరిపించె అలుకలు, ముత్యపు నగవుల [2]
శోభిల్లె, జగమూయలకాగా [ఆనందం]



Credits
Writer(s): Lakshmi Valli Devi Bijibilla
Lyrics powered by www.musixmatch.com

Link