Alayam

ALAYAM
శ్లోకం: "పరిత్రాణాయ సాధూనాం, వినాశాయచ, దుష్కృతాం;
ధర్మ సంస్థాప నార్ధాయ, సంభవామి యుగే, యుగే"
పల్లవి: ఆలయం దేవాలయం ధర్మార్ధ కామ, మోక్ష,
సాధనలకు ఇదినిలయం "2"
అ.ప: అలదైవమే ధర్మదేవతగ ఇలలో
కొలువుండేదే ఆలయం "ఆలయం"
చరణం: బృహ్మాండమునే ఉదరమునదాచిన ఆ
బృహ్మాండనాయకుని, నిత్యనివాసము "2"
బృహ్మ తత్వమును బోధించే బృహ్మాత్మకునీ
బృహ్మాండ వాసము "ఆలయం"
చరణం: ముల్లోకములను ముమ్మూర్తుల
యేకముచేసే ముచ్చటైన ఆదైవనివాసము "2"
ముజ్జగములకూ మూలరూపమగు
ముకుందునీ ముఖ్యనివాసము "ఆలయం"
చరణం: పరమపవిత్రత, శుచీ శుభృతకు నెలవైవున్నది,
ఇలలోని ఆ దైవనివాసము "2"
మనసార జని, ముదమార గని,
మధురాను భూతిని పొందునులే! మనము "ఆలయం"



Credits
Writer(s): Lakshmi Valli Devi Bijibilla
Lyrics powered by www.musixmatch.com

Link