Ambavuneeve

AMBAVU NEEVE
శ్లోకం: నమస్తే, శుద్ధ సేవ్యాని, ఆర్యే, మందార వాసినీ
కుమారీ, కామినీ, కపాలీ కపిలే, కృష్ణ పింగళే
భద్రకాళీ, నమస్తుభ్యం, కోటదుర్గా "నమోస్తుతే"
పల్లవి: అంబవు నీవె, జగదంబవు నీవె
జగములనేలే, జననివి నీవే
అంబా, శరణం, జగదంబా! "2"
చరణం: భరతాది మునివరులు, నినుబూజింపగ
ఆనందమనముల వచ్చిరి తల్లీ!
జలజాక్షి! నీ మహిమ వర్ణింప తరమా! నీవే,
మాతల్లి, దాక్షాయణీ! నవ మల్లెలు, చంప, కలువలు,
సంపెంగ పూలు తెచ్చినిన్ను, బూజింతు, ముదమార,
మణి ద్వీపమునందు, కొలువుండు మాతల్లి!
వరములీయగ రావె! శ్రీ చక్రవాసినీ
అంబా, శరణం, జగదంబా, "2"
చరణం: వినినంత, నీపాద మంజీరనాదములు
దనుజుల గుండెల ఘీంకార ధ్వనులు
నవదుర్గవై నీవు, అసుర సంహారము జేసి,
లోకములు పాలింతువే, తల్లీ
సద్గుణముల రాశి, శివవామ భాగమున
నెలవుండినావు, శివరమణివై నీవు
నీ సేవయె మాకు, సౌభాగ్యమే తల్లీ!
అభీష్టసిద్ధివి, మా కల్పవల్లివి
అంబా, శరణం, జగదంబా "అంబవు" "2"



Credits
Writer(s): Lakshmi Valli Devi Bijibilla
Lyrics powered by www.musixmatch.com

Link