Tenugunatanu

TENUGUNATANU
పల్లవి: తెనుగు నాటను బుట్టి, జానపదమునకు
వన్నె తెచ్చిన, వెన్నెల రాజమా!
అ.ప: మా అన్నమయ్యా! నీ సాటి ఎవరయ్యా! [2]
చరణం: అన్నప్రాసననాడు, కలమును చేపట్టి
భవితకు, భాష్యము తెలిపిన పాపడు
హరినామమును, వినక, అరమెతుకు ఐనను
ముట్టడీ బిడ్డడు, మురిపించె తనయుడు
అల వేంకటపతి, అర భుజియించినది
దినిన ఆతడు, అవ్యాజకరుణను
పొందె, ఘనుడు [మా అన్నమయ్య]
చరణం: భక్తి, శృంగారముల, సంకీర్తనలచే
కంజదళాయుని, చక్కగా నలరించె
అలరు, అలమేల్మంగపతి, మదిని గెలిచెను
ఇలను, ముక్తిని బడసి, జగతిలో నిలచెను
తొలుత వాగ్గేయకారునిగ తనువెలిగెను
తెలుగు పదములకు, ఆయువు పట్టాయెనతడు
[మా అన్నమయ్య] "తెనుగునాటను"



Credits
Writer(s): Lakshmi Valli Devi Bijibilla
Lyrics powered by www.musixmatch.com

Link