Vandanamammaa

VANDANAMAMMA

పల్లవి: వందనమమ్మా! అభివందనం
మా చదువుల తల్లీ! అభివందనం
సకల విద్యల సారము, ఈ సర్వశక్తి సాకారము
సత్యరూపమయి, సామగానమయి, హంసవాహినీ "వందన"
చరణం: వీణావాణి, పుస్తకపాణివి నీవే సకల కళల
కాణాచివి నీవే వికసిత వదనపు శిశిరకాంతివి నీవే
వెలుగుచిందు మా భారతి నీవే బ్రహ్మ దేవుని మానసవల్లి
అష్టసిద్ధులొసగు నాల్గు వేదముల మూల శక్తివి
ఇల మము తరియింపవె తల్లీ "వందన"
చరణం: స్వచ్ఛమైన వాక్కు, వచనం నీవే విద్య నేర్పించు
సత్యము నీవే, సిరియు, విద్యయు, ఉభయము నీవే
నరులు పొందుదురు భూతల స్వర్గము విద్యతోనె మనుగడ
సతతం విద్యయొసగు సకలం విద్య కలిగినచొ ఉన్నత స్థానం
సర్వ సుఖములకు సోపానం "వందనం"



Credits
Writer(s): Lakshmi Valli Devi Bijibilla
Lyrics powered by www.musixmatch.com

Link