Pikamula

PIKAMULA
పల్లవి: పికముల, కిలకిల రవములతో "2"
ప్రాభాత వేళల, పుష్పాంజలులతో "2"
అ.ప: ఆనంద, సందోహ వందనం,
భక్తులెల్లరును, నీరాజనం "పికముల" "2"
చరణం: తాళ్ళపాక అన్నమయ్య, సంకీర్తనలతొ నిను
అలరించగ, వేచి యుండెను, స్వామి "2"
తిరు వేంగమాంబ, ముత్యాల హారతితో "2"
గానము సేయగా, వేచి యున్నది స్వామి!
వేగమెరావా! వేంకటరాయా వేగమెరావా! వేంకటరాయా "పికముల" "4"
చరణం: సాగర మధనా! సంధ్యా కాంతుల "2"
సప్త గిరులలో, ఎటు తిలకించిన
నీ నామమె, ఇక నీ గానమే, స్వామి అణు వణువూ, మరి నీ ధ్యానమే
వేగమెరావా! వేంకటరాయా వేగమెరావా! వేంకటరాయా "పికముల" "4"



Credits
Writer(s): Lakshmi Valli Devi Bijibilla
Lyrics powered by www.musixmatch.com

Link