Siripuravasiniki

SIRIPURAVASINIKI
పల్లవి: సిరిపుర వాసినికి, శ్రీమహాలక్ష్మికి "2"
హరిహృదయ వాసినికి నీరాజనం నిత్య నీరాజనం "నీరాజనం"
అ.ప: భక్త జన పోషణికి, భక్తహృదయాలకు
పద్మ సంభవకును, నీరాజనం నిత్యనీరాజనం "సిరి"
చరణం: అంబుజ వాసినీ! అబ్బుర పరచేవు "2"
ఎనలేని, కీర్తి యశస్సుల నొసగి
అంబుజాక్షునీ, హృదయ పీఠమున వసియించి,
సిరులను అందింతువూ నీరాజనం, నిత్యనీరాజనం "సిరి"
చరణం: మునిగణ సురవినుత, మునిజనానంద "2"
దీన జన పాలికా, దిగంత వ్యాపికా
సాగర తనయా, సరసిజ నయనా సర్వాత్మకాత్మకా,
సంతుష్టప్రదాయికా నీరాజనం, నిత్య నీరాజనం "సిరి"



Credits
Writer(s): Lakshmi Valli Devi Bijibilla
Lyrics powered by www.musixmatch.com

Link