Puvvunaku

PUVVUNAKU
పల్లవి: పూవునకు, పూదారమునకు బంధమేల యుండునో!
అల దైవమునకు, ఈ మానవునకును,
బంధమటులనే తెలుపగను "హరిలోరంగ హరీ" "2"
చరణం: పూవునకు, పూతావికిని, బంధమేల యుండునో
మాధవునకు, మానవునకునూ, అటులనే బంధముండును
తరువులకు, మరి వ్రేళ్ళకూగల బంధ మెటులుగా యుండునో
మనుజునకు, అలదైవమునకును అటులనే బంధము "పూవునకు"
చరణం: నగమునకు మరి భువికినీ గల బంధమెటులనో తెలుపగను
నగధరునకు మరి నరునకూ గల బంధమదియే యోచించగా
తల్లికీ, మరి బిడ్డకూ గల బంధమేలనో ఇలలోన
మహీధరుడు, మనుజునకూ గల బంధమే ఆబంధము "పూవునకు"



Credits
Writer(s): Lakshmi Valli Devi Bijibilla
Lyrics powered by www.musixmatch.com

Link