Purushothamudu

పురుషోత్తముడు
పల్లవి: పురుషోత్తముడు, అమృతమయుడు
సకలజీవులా, నిలయుడీతడు [పురు]
చరణం: చిరు చిరు వెలుగుల దివ్వెల తానే
చిగురు టాకులా పచ్చందము తానే [2]
ఉదయకాలపు, అరుణిమలు తానే
గోధూళి వేళలా కళలనూ తానే [పురు]
చరణం: సెలయేరులలో గలగలలు తానే
గిరి శిఖరములా ఘనత తానే [2]
పికములు జేయు కిల కిల రావముల
సరిగమలు తానే, తానే అంతయు [పురు]
చరణం: ఖ్యాతియు తానే, రీతియును తానే
నీతియు తానే, నిత్యము తానే [2]
నిత్య సత్యము, తత్వము తానై
వెలుగొంది నాడులే, వేంకట నాధుడై [2] [పురు]



Credits
Writer(s): Lakshmi Valli Devi Bijibilla
Lyrics powered by www.musixmatch.com

Link