Poojinture

పూజింతురే

పూలపోలికలతొ, వర్ణింతురది, ఏమి [2]
అ.ప.: తపమేమి జేసెనొ, నీ పదములజేర
అవి తపమేమి జేసెనొ, నీ పదముల జేర [పూజింతురే]
చరణం: అరవిందమా! నిను వర్ణింప రమణీయం
నీదళములబోల్చ, జలజాక్షుగన్నులు [2]
ఎంతభాగ్యమేనీది, ఇల కమనీయము
పద్మనాభునేబోల్చ, జేసితివే, పుణ్యం [పూజింతురే]
చరణం: శశాంకుని వెలుగు, నీమేని తెలుపు
శ్వేతాంగనవు, శోభాయమానవు [2]
కమల నయన, నిన్ను కేశముల దురుమగ
కళలొలుకుదువె నీవు, పుష్పరాజమా! [పూజింతురే]
చరణం: అమరపురవాసిని, సురలోక పూజిత
వెలిగెదవు నిత్యం, రమణుని గళమున [2]
నీఛాయ అయినది, శ్రీహరికి ప్రియముగ
జేసితివి పుణ్యం, నీజన్మమేధన్యం [పూజింతురే]
చరణం: చంద్రుని చలువల, శశి కిరణమ్ముల
వికసించెదవే నీవు శిశిర కాలమ్ముల [2]
వాగ్దేవి ప్రియతమవి, శ్వేతవర్ణినివి



Credits
Writer(s): Lakshmi Valli Devi Bijibilla
Lyrics powered by www.musixmatch.com

Link