Athmaku

ATHMAKU
పల్లవి: ఆత్మకు ఎన్నడు అంతము లేదన్నా "2"
ఈ ఆత్మకు ఎన్నడు అంతము లేదన్నా!
అ.ప: ఎన్నడు మలినము కానే కాదన్నా "ఆత్మకు"
చరణం: "మనమను" అంటుయె, అంటదు రోరన్నా
"మనదను" జాడ్యమె, పట్టదు రోరన్నా "2"
ఏబంధముల చిక్కక, ఆనంద పడునన్నా
జంజ్యాటముల వలలో, చిక్కదు ఓరన్నా"ఆత్మకు"
చరణం: జీవము వుంటే రారాజువురన్నా
అది లేకుంటే, నీ వెవరోరన్నా
జగన్నాధుని చరణాల జేరుర ఓరన్నా
జగన్నాయకుని ఆనతి గైకొనరోరన్నా "ఆత్మకు"
చరణం: చిదానందముతొ మెలగుమురోరన్నా
చిక్కులలో నువు పడకుర, ఓరన్నా
ఆత్మానందము, నీ హక్కురన్నా
ఆత్మకు సాక్ష్యము అక్కర లేదన్నా "ఆత్మకు"



Credits
Writer(s): Lakshmi Valli Devi Bijibilla
Lyrics powered by www.musixmatch.com

Link