Atunitunanthayu

అటునిటునంతయు
పల్లవి: అటునిటునంతయు, వెదకి చూచితి
యంతవెదకిన, నినుకాననైతినే [2]
చరణం: ఇంతలోన, నేనెంత యోచించి,
నాసొంతమని, అనుకొంటినిన్నే [2]
అంతయు వెదకితి, నేనెంత అనుచితుడ [2]
అంతయునిండిన, అంతర్యామివె [అటునిటు]
చరణం: ప్రాతఃసమయాన,కొలువు దీరితివని
మేల్గాంచి, నీకొరకే, ఆతురపడితి [2]
నలుదిశలా వెదకి, వేసారితినే
నేర్చితి,నీవే సర్వవ్యాపివని [అటునిటు]
చరణం: అఖిల జీవుల, పోషకుడ వీవని
నేనను, నీవను వర్ణమె వలదని [2]
సకల లోకముల పాలకుడ వీవని [2]
తెలిసి, ననునేమలచుకొంటిని [అటునిటు]



Credits
Writer(s): Lakshmi Valli Devi Bijibilla
Lyrics powered by www.musixmatch.com

Link