Bhayamelaa

BHAYAMELA
పల్లవి: భయమేల! ఇక భయమేల అభయ హస్తుడే వుండగా "2"
అ.ప: ఆదియు, అంతము అతడే కాదా భయమేలనె మనసా! "భయ"
చరణం: భారమేల! నీచెంతన బంధవిముక్తుడు వుండగ
ఆధారమేల! మరిభూతభావనుడు, నీతోడు వుండగ "2"
యోచనేలనేమనసా! యుగపురుషుడువుండగ
సంకోచమేలనేమనసా! సంకర్షుణుడుండగ "భయ"
చరణం: పర దైవమేలమనసా! హరివెన్నంటే వుండగా
పరమొసగు వరదుడీతడు, పురుషోత్తముడీతడు "2"
పురుషార్థమతడు మనసా! అర్థము తానవునుగ
పరమపురుషుడు మనసా! మనపరమే తానుగ "భయ"



Credits
Writer(s): Lakshmi Valli Devi Bijibilla
Lyrics powered by www.musixmatch.com

Link