Bramhosthovam

బ్రహ్మోత్సవం
పల్లవి: బ్రహ్మోత్సవం, ఇది బ్రహ్మోత్సవం
తిరు వేంకటేశ్వరుని బ్రహ్మోత్సవం [బ్రహ్మో]
చరణం: సాగరమధనమున గరళామృతము వెడల
కంఠమునందు దాచె, గరళము హరుడు [2]
కాపాడె లోకములు, ఆ సాంబశివుడె
అశృనయనమ్ములా కొనియాడె లోకములు [బ్రహ్మో]
చరణం: అమరులను జేసేటి, అమృతమ్మును
సురలు, అసురులూ, కోరితిరీసమముగ [2]
మూర్తులూ, మువ్వురు, పడిరి సందిగ్ధమున
యుక్తి సహితంబుగ యోచించె శ్రీహరి [బ్రహ్మో]
చరణం: హరిమారెను, మోహినిగ, సర్వాంగ సుందరిగ
అసుర, సురలు యిరువురు, తీరిరీ బారులుగ [2]
వలికించె మోహిని, వలపు వయ్యారములు
మునిగెను, అసురులు, మోహ సంద్రముల [బ్రహ్మో]
చరణం: అమృతము సురలకు, అసురులకు జలమును
పంచె మోహిని, అంత అసురులను మరిపింప
అవతరించునులె ఆ దేవదేవుండు
జగములను గాపాడ దీనబాంధవుడూ [బ్రహ్మో]



Credits
Writer(s): Lakshmi Valli Devi Bijibilla
Lyrics powered by www.musixmatch.com

Link