Chaduvulu

CHADUVULU
పల్లవి: చదువులు మెండుగ ఎంత నేర్చినను
చదువరిని చదువక సూన్యము సుమ్మీ "2"
చరణం: అచంచలమగు అచ్యుతుని సేవలు
మహిలోన బహు చదువులు సుమ్మీ "2"
భువిపైన విద్యలు, ఎన్ని నేర్చినను "2"
శ్రీపాలుని మదిలో నిలుపుము సుమ్మీ
ఆ శ్రీపాలుని మదిలో నిలుపుము, సుమ్మీ "చదువులు"
చరణం: ధరణిలోన లౌకిక విద్య లెన్నున్ననూ
లోకోత్తమునీ కొలచుటే మిన్న "2"
ధరణీ ధరునీ, ధరలోన కొలచిన "2"
అవి కొలువు గాలేని విద్యలే సుమ్మీ "చదువులు"
చరణం: ముంగిటి సన్నిధి, ముజ్జగపు పెన్నిధి
నాలుకలపై తేనె లొలుకు ఆ పదము "2"
చదువక నైననూ హరినామము "2"
జాలువారిన చాలును, సుళువగును పరము "చదువులు"



Credits
Writer(s): Lakshmi Valli Devi Bijibilla
Lyrics powered by www.musixmatch.com

Link