Chandanam

LYRICS: CHANDANAM
పల్లవి: చందనం పూయ రారె, అమ్మలాలా!
చలువ చందనం, పూయ రారె, అమ్మలాలా! "2"
అ.ప: అంద చందముల సుందర వదనకు "2"
సుందరేశునీ పంకజనయనకు "చందనం"
చరణం: కుంకుమ దిద్ద రారే
కస్తూరీ కుంకుమ దిద్ద రారె, అమ్మలాలా! "2"
ముగ్ధ మోహినికి, లోక పావనికి "2"
నాగాభరణుని, వామభాగినికి "చందనం"
చరణం: హారము లేయ రారె
పచ్చల హారము లేయరారె, అమ్మలాలా! "2"
పచ్చని పీతాంబర ధారిణికి "2"
పసిడి సింహాసన పీఠినికిని "చందనం"
చరణం: హారతు లీయ రారె
కర్పూర హారతు లీయ రారె, అమ్మలాలా! "2"
హాస్యముఖీ, హరి సోదరికి "2"
జటాధరునీ హృదయేశ్వరికిని "చందనం"



Credits
Writer(s): Lakshmi Valli Devi Bijibilla
Lyrics powered by www.musixmatch.com

Link