Chinni Krishnaiah

CHINNI KRISHNAIAH
పల్లవి: చిన్ని కృష్ణయ్యా, మా చిన్ని కృష్ణయ్యా
గురువాయూరున, వెలసిన ముద్దు కృష్ణయ్యా [2]
చరణం: ముద్దులొలుకు నగుమోము, కస్తూరి తిలకముతొ
కరమున నవనీతముతొ, అలరారిన కృష్ణయ్యా [2]
మాత యశోదకు నీవు పదునాల్గు భువనములు
జూపి తాపమునే బాపితివి, కృష్ణయ్యా [2]
బాల్యమునందే, బల పరాక్రమమును
జూపితివయ్యా, రక్కసుల నణంచి [2]
చరణం: వామన రూపమున, బలిదర్పము నణచితివి,
ఆనందము చేకూర్చి, మము బ్రోచిన కృష్ణయ్యా [2]
అవతారమేదైన, ఆంతర్య మొకటె యని
లోకమునకు చాటితివి, శోకమునే బాపితివి [2]
చిన్నికన్నయ్యా! మా బాల కన్నయ్యా
వేగ రావయ్య! ఏతెంచ రావయ్యా! [చిన్ని] [2]



Credits
Writer(s): Lakshmi Valli Devi Bijibilla
Lyrics powered by www.musixmatch.com

Link