Veduru

VEDURU
పల్లవి: వెదురుకొమ్మన సప్త స్వరములు
పలికెనులె! అవి వేయిరాగములు [2]
అందరి మది దోచెను ఆనందుని కడ జేరెను
వేణువై విలసిల్లెను వెదురు ఎంతపుణ్యము చేసెనో! [2] [వెదురు]
చరణం: కానల బుట్టేను, కానల బెరిగేను
వాయు తరంగము, గడుపు నింపేను [2]
వెదురు గొమ్మయె వేణు వాయెను
తరంగములు సరిగమలు ఆయెను [వెదురు]
నంద గోపాలుని కరములందున జేరి
మృదు స్పర్శకు అది పులకించి పోయింది [2]
బృందావనిలొ, రాధమ్మ మదిలో
సమ్మోహినై తారంగ మాడింది [వెదురు]
చరణం: ఎల్ల గోపాలురు పశు పక్ష్యాదులు
తన్మ యత్వమున, ఆడి పాడేరు [2]
గోకులంబంత, మృదు రవళుల
ఆనంద నాట్యముల మురిసిందిలే [వెదురు]
నంద గోపాలుని స్పర్శ చేత
వెదురు ఆయెను, పిల్లన గ్రోవిగ, భువిలోన [2]
ఆ గాన లోలుని కరుణుంటే
రాయి అయిన, "రత్నము"గ మారేనులే [వెదురు]



Credits
Writer(s): Lakshmi Valli Devi Bijibilla
Lyrics powered by www.musixmatch.com

Link