Vedukalonu

VEDUKALONU
పల్లవి: వేడుకలోనూ, వేదనయందున నీ
పదములె, మా గతియని నమ్మితి [2]
అ.ప: వాడ వాడలలోన, వాడియగు రూపము [2]
వారధిగా నిలచి, వరము లొసగేను [వేడుక]
చరణం: అంతర్యామివని నిను కొందరందురు
నిరాకారుడవని మరి కొందరందురు [స్వామి]
వక్కాణింతురు, వేద వేద్యులు [2]
ఏదైనను, నీది దివ్య రూపమని [వేడుక]
చరణం: భక్తా శ్రేయుడవని అందురు కొందరు
భక్త సులభుడని ఇంకొంద రందురు
పొగడుదురే, నిను పలు నామమ్ముల [2]
ఏమైనను, నీనామమే, నిక్కము [వేడుక]



Credits
Writer(s): Lakshmi Valli Devi Bijibilla
Lyrics powered by www.musixmatch.com

Link