Vinatulive

VINATHULIVE
పల్లవి: వినతులివె, చేకొనవొ, తల్లీ, వరలక్ష్మీ
హారతులివె, గైకొనవొ, తల్లీ, మహలక్ష్మీ "2"
చరణం: చేరి అందరము, మ్రొక్కి, కోర్కెలను కోరేము
అభీష్టములు నెరవేర్చవె, తల్లీ నారాయణీ! "2"
మానసముల మలినమును, కడిగివేయుమమ్మా "2"
పరిపూర్ణ మనసులనె, అర్పింతుమమ్మా "వినతులివె"
చరణం: తొలివేకువలొ, అల కోయిలల స్వరముల
సరిగమల రాగమె, నీ గానముగ "2"
తొలికిరణములు, నీకు అందించునమ్మా "2"
పిండివెన్నెల, దీపారాధనగా, అమ్మా! "వినతులివె"
చరణం: అష్టసిరులను, నీవు అందించగ, రావమ్మా
భోగభాగ్యములను, కరుణించగ, రావమ్మా "2"
నీమువ్వల సవ్వడులె, సంపద కావళ్ళు"2"
నీ ముత్యపు నగవులె, ముద్దబంతి లోగిళ్ళు "వినతులివె"



Credits
Writer(s): Lakshmi Valli Devi Bijibilla
Lyrics powered by www.musixmatch.com

Link