Vinayaka

VINAYAKA
పల్లవి: వినాయకా, మా బుజ్జి " వినాయకా"
విఘ్నాలన్ని, తొలగించే "వినాయకా"
అ.ప: రావా, వేగమె రావా!
మా పూజలు అందుకోవా! "వినాయకా"
చరణం: చిట్టి ఎలుక నీ వాహనం
నువు ముల్లొకములు చుట్టేవట "2"
సుందర రూపము, మందగమనము
మెప్పించేవట, లోకములెల్లను
సాంబశివునికి, ముద్దుబిడ్డడివి
షణ్ముఖునకు సోదరుడవంట "వినాయకా"
చరణం: గణములన్నిటికి, అధిపతివంట
నువు గణపతయ్యగా, నిలిచావంట "2"
నీవేనయ్యా, మా ప్రధమ నుతులలో
ఇచ్చేవంట ప్రమోదమ్ములు
విద్యా బుద్ధుల నొసగుమయ్యా!
వినయమ్ము తోడ మెలిగేమయ్యా! "వినాయకా"



Credits
Writer(s): Lakshmi Valli Devi Bijibilla
Lyrics powered by www.musixmatch.com

Link