Vrelupatti

VRELUPATTI
పల్లవి: వ్రేలుపట్టి, నడిపించెడి దైవము
వెనుకకు మరలి, యోచించని దైవము [2]
అ.ప.: ఎల్ల తావుల, నిండిన దైవము
ఎల్ల త్రోవల, యుండెడి దైవము [వ్రేలు] [2]
చరణం: దుర్జనుల మనముల నిండిన దైవము
సజ్జనుల పాలి, చల్లని దైవము [2]
ముజ్జగములకు, మూలము దైవము
ముని గణములకు, ముంగిటిదైవము [వ్రేలు]
చరణం: ముడుల త్రోవలలోన, విడుపుల దైవము
లోగిళ్ళలో, ముక్తి దోసిళ్ళ దైవము [2]
దీనులపాలిటి, ఆది దైవము
ఆధీన మగుదుము, అతడికి మనము [వ్రేలు]



Credits
Writer(s): Lakshmi Valli Devi Bijibilla
Lyrics powered by www.musixmatch.com

Link