Sirisirimuvvala Krishnaiah

SIRISIRIMUVVALA KRISHNAIAH
పల్లవి: సిరిసిరి మువ్వల కృష్ణయ్యా! శ్రీ రంగ రాయా! కృష్ణయ్యా [2]
అ.ప: ముద్దుల కృష్ణుడ వీవయ్యా! మురిపాల బాలా రావయ్యా! [సిరి]
చరణం: కన్నయ్యా! నీమహిమలు జూపి గోకుల వాసుల
మనసులు గెలిచి గోకుల బాలా! వేణువునూది
గోపిక లందరి మనమున నిలచి
కలిగించితివీ, నీవు, భక్తి భావము, దెలిపితివయ నీవు
వైరాగ్య యోగము రేపల్లెవాడల వెన్ననుదోచి నవనీత చోరా!
అల్లరి చేసి మనసులు జేతువె, నవనీతభరితం [సిరి]
చరణం: కొండలలో వెలిశావయ్య మాకండగ నీవు నిలిచావయ్య
ధర్మ స్థాపన, నీ ఆంతర్యం ప్రతియుగ మందున నీ అవతారం
సత్య, ధర్మ, న్యాయం, నీ లక్ష్యమట, శోధ, సాధనం, నీ
సంపూర్ణత్వమట కర్మ యోగమే, గీతా సారం ధర్మరక్షణం, మా
కర్తవ్యం నాల్గు వేదముల సారాంశం అందించితివీ,
జీవన వేదం కలి యుగమున, మా కొండల రాయా [సిరి]



Credits
Writer(s): Lakshmi Valli Devi Bijibilla
Lyrics powered by www.musixmatch.com

Link