Sri Ranganayaki

SRI RANGANAYAKI
పల్లవి: శ్రీరంగనాయకి, వైకుంఠరమణి
దయసేయవమ్మా! మామానసముల "2"
అ.ప: చంద్ర సహోదరి, శ్రీ మహలక్ష్మీ
కరుణించవమ్మా, కమలవాసిని "శ్రీ రంగ"
చరణం: జగతి, నీతోనడచు, అనునిత్యమమ్మా
జీవన పధములో, నీవొకభాగమే "2"
సకల విధులకు నీవే ఆధారం
సౌమ్య శీలుర గృహమే నీ నివాసం
సత్యవాక్కు, సత్యభూషణుల హృదయములందే
సతతం, కొలువుదీరి, కాతువే
మా తల్లి, మహలక్ష్మీ "శ్రీ రంగ"
చరణం: సాగర మధనమున, ఉద్భవించితివి, తల్లీ
విష్ణుదేవుని పత్ని సిరిగల తల్లివి "2"
సముద్ర తనయవు, త్రైలొక్య పూజితవు
కొలువుండవమ్మా, కాపాడవమ్మా!
ఏ గృహము నిత్యము రంగవల్లులతొ
తీర్చి దిద్దునో, అది నీ నివాసము
సుమహాసిని, సుమధుర భాషిణి "శ్రీ రంగ" "2"



Credits
Writer(s): Lakshmi Valli Devi Bijibilla
Lyrics powered by www.musixmatch.com

Link